AP: ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల పరిధిలో తాగునీటి పథకానికి అమరజీవి జలధార పేరును ఖరారు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును అందరూ తలచుకొనేలా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పథకానికి సంబంధించిన పోస్టర్ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.