సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే MS రాజు తన హామీని నెరవేర్చుకున్నారు. అమరాపురం నుంచి వీరాపురం వెళ్లే రోడ్డు పనులను నెల రోజుల్లోనే వేగవంతం చేయించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం పనులు వేగంగా సాగుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతతో కూడిన రహదారి నిర్మాణం వల్ల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.