TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో వెల్లడైన అంశాలతో కూడిన నివేదికను సిట్ అధికారులు ‘సీల్డ్ కవర్’లో కోర్టుకు సమర్పించనున్నారు. ఈ సీక్రెట్ రిపోర్ట్ ఆధారంగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.