ATP: శింగనమల నియోజకవర్గంలోని రహదారి సమస్యలపై MLA బండారు శ్రావణి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం సమర్పించారు. జాతీయ రహదారి NH-544D పనుల్లో భాగంగా శింగనమల క్రాస్ వద్ద వాహనాల అండర్ పాస్ నిర్మించాలని కోరారు. అండర్ పాస్ లేకపోవడం వల్ల స్థానిక రైతులు, వ్యాపారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఎంపీ అంబికాతో కలిసి మంత్రికి వివరించారు.