నెల్లూరు నగరంలోని సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ మ్యాప్, పరిసరాలు, రికార్డులను పరిశీలించి, పరిశుభ్రత పాటించాలని సూచించారు. సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ పాయింట్స్, హిట్ & రన్ కేసులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.