దాదాపు 2 దశాబ్దాలపాటు రెజ్లింగ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వెటరన్ రెజ్లర్, 17 టైమ్స్ WWE ఛాంపియన్ జాన్ సీనా రేపు తన చివరి మ్యాచ్ ఆడనున్నారు. ఉదయం 6:30 గంటలకు ప్రారంభమయ్యే SNME ఈవెంట్లో గుంథర్‌తో తలపడనున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ‘Never Give Up’ అన్న స్ఫూర్తిని చాటిన జాన్ సీనా.. తన ‘Last Time is Now’ ఫేర్వెల్ టూర్‌ను గతేడాది జూలై 7న ప్రకటించారు.