GDWL: గట్టు మండల పరిధిలోని గంగిమాన్ దొడ్డి గ్రామంలో ఈనెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దొంగ ఓటు వేయించుకుని కావాలి పద్మ సర్పంచ్‌గా గెలిచారని, ఓడిపోయిన అభ్యర్థి జయమ్మ గట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఫిర్యాదు చేశారు. దొంగ ఓటు వేసిన ఓటరు మండల కేంద్రానికి చెందిన వ్యక్తి అని, అతను గట్టు మండల కేంద్రంలో 7వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్నాడన్నారు.