PDPL: జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 181 మంది ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ కోయ శ్రీ హర్ష షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకపోవడం, నిర్లక్ష్యంగా పనిచేయడంపై ఈ చర్యలు తీసుకున్నారు. నోటీసులు అందుకున్న వారిలో 53 మంది పోలింగ్ అధికారులు, 128 మంది ఓపీవోలు ఉన్నారు.