WNP: పెబ్బేరు మండలం NH44 హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బులోరా బండి గంగాపూర్ గ్రామానికి చెందిన బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వ్యక్తికి తలపైన తీవ్రంగా గాయంకావడంతో జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థాలానికి చేరుకున్న ఎస్ఐ యుగేందర్ రెడ్డి కేసు నమోదు చేశారు.