విశాఖ జీవీఎంసీ పరిధిలో ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా అన్ని జోన్లలో 336 ఆక్రమణలను తొలగించినట్లు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర్ రావు శనివారం తెలిపారు. ఫుట్‌పాత్‌లపై ప్రజల సురక్షిత నడకకు, రోడ్లు–జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌కు అడ్డంకులు తొలగించేందుకు పోలీసుల సహకారంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.