ADB: తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రాధా మనోహర్ ఏకగ్రీవ సర్పంచిగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లతో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను నేరడిగొండలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవమైన అభ్యర్థులను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.