SRPT: కోదాడ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 14 గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాటు చేశామని, కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌కు అడ్డంకులు కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.