HYD: మలక్పేట నియోజకవర్గంలో ఏర్పాటైన 9 డివిజన్లపై 8 అభ్యంతరాలు అందాయని జీహెచ్ఎంసీ సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ ఎంకే ఇంకేషాఫ్ అలీ తెలిపారు. సరిహద్దులు, పేర్లు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు. అభ్యంతరాలను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పంపించినట్లు పేర్కన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 150 డివిజన్ ఉండగా ప్రభుత్వం 300 డివిజన్లను ఏర్పాటు చేశారు.