కృష్ణా: ముప్పాళ్ళ గ్రామంలో బీసీ, ఎస్సీ కాలనీలకు జిల్లా పరిషత్ హై స్కూల్కు సరఫరా అయ్యే రక్షిత మంచినీటి పైప్లైన్ పనులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.