ADB: యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సంతోషకరంగా ఉందని ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ అన్నారు. శనివారం గాదిగూడ మండలంలోని లోకారి(బి) గ్రామపంచాయతీ సర్పంచిగా గెలుపొందిన యువ నాయకుడు మడావి తానాజీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోను యువత బరిలో నిలవాలన్నారు.