విశాఖలోని సీతమ్మధారలోని లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్లో శనివారం మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల్లో సుమారు 90 మంది రోగులను పరీక్షించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ఇలాంటి శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని మేనేజింగ్ ట్రస్టీ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు తెలిపారు.