MBNR: జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశాలకుగాను శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగాముగిశాయి. ఉమ్మడి జిల్లాలో 29కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా, దరఖాస్తు చేసుకున్న 7115మంది విద్యార్థులకుగాను, 5607మంది విద్యార్థులు హాజరుకాగా,1508మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు వట్టెం నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు.