SRD: గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్పూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆసం సునీత అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం గడపగడపకు తిలకం దిద్ది ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందులో సురేష్, విఠల్, రాములు శంకర్, తదితరులు పాల్గొన్నారు.