GNTR: అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేట 1వ లైన్లో గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు యువకులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వెస్ట్ DSP అరవింద్ బాబు నిందితుల వివరాలను వెల్లడించారు. పాలపర్తి కిరణ్ (బొంగరాలబీడు), సందీప్, సంపత్ నాయక్ (నంద్యాల జిల్లా) అరకు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడానికి ప్రయత్నించారని చెప్పారు.