TG: BRSపై జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ‘నన్ను నిజామాబాద్‌కే పరిమితం చేశారు. నా నగలు అమ్మి బతుకమ్మ చేశాను. అలాంటి నాపై అవినీతి రుద్దుతున్నారు. ఎవరి బెదిరింపులకు భయపడను. ఇదంతా చేయిస్తున్న గుంటనక్కకు సమాధానం చెప్తా. ప్రజల కోసం పోరాడుతాను. భూముల అమ్మకానికి BRS ప్రభుత్వం కిటికీలు తెరిస్తే.. కాంగ్రెస్ తలుపులు తెరిచింది’ అని మండిపడ్డారు.