NZB: కోటగిరి మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా 5 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అడ్కాస్ పల్లి సర్పంచిగా రెడ్డి రామకృష్ణ, రాంపూర్ సర్పంచిగా శాంకీ బాయి, దేవుని గుట్ట తండా సర్పంచిగా కొర్ర రవి నాయక్, సుద్దులం తండా సర్పంచిగా మౌనిక, వల్లభాపూర్ సర్పంచిగా పుష్పబాయి ఏకగ్రీవం ఎన్నుకున్నారు. 11 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.