NLG: ఓటు కోసం డబ్బులు పంపిణీ చేయకుండా సర్పంచ్ ఎన్నికలు జరిపి గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన నలుగురు.. ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచకూడదని వాగ్దానం చేసుకున్నారు. ఆ నలుగురు తమ ఒప్పందాన్ని నిలబెట్టుకుని, డబ్బు రహితంగా ఎన్నికలు నిర్వహించారని గ్రామస్థులు తెలిపారు.