శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళా రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై మధుసూదన్ రావు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె వయసు సుమారుగా 30 – 35సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9440627567 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.