MDK: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రామాయంపేట ఎస్సై బాలరాజు సూచించారు. మండల పరిధిలోని కాట్రియాల గ్రామంలో శుక్రవారం ఎఫ్ఎస్ టీ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.