కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో బహుళ అష్టమి సందర్భంగా శుక్రవారం ఉదయం వేకువ జామున రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు హోమము, అభిషేకము మొదలగు పూజలు నిర్వహించి స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు.