TG: రేపు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను DGP శివధర్ రెడ్డి పర్యవేక్షించారు. ‘భద్రతా నియమాల గురించి మెట్రోరైళ్లు, ప్రధాన కూడళ్లలో బోర్డులతో ప్రచారం చేయాలి. ట్రాఫిక్ మళ్లింపు వివరాలు ముందే ప్రచారం చేయాలి. స్టేడియంను భద్రతా అవసరాల రీత్యా నాలుగు సెక్టార్లుగా విభజించాం. 39 వేల మంది సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు.