2 Telugu movies: ఈ రెండు తెలుగు సినిమాలకు భయడుతున్న బాలీవుడ్!
ఒకప్పుడు ఏమో గానీ.. ఇప్పుడు మాత్రం టాలీవుడ్‌ని చూస్తే భయపడిపోతుంది బాలీవుడ్. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయింది టాలీవుడ్. ముఖ్యంగా హిందీ జనం మన సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అప్ కమింగ్ సినిమాల్లో ఓ రెండు ప్రాజెక్ట్స్ మాత్రం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు చెమటలు పట్టిస్తున్నాయి.
Two Telugu movies: బాహుబలి తర్వాత వచ్చిన కెజియఫ్ 2, పుష్ప, ట్రిపుల్ ఆర్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాయి. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ రావడంతో టాలీవుడ్ క్రేజ్ గ్లోబల్ స్టాయికి వెళ్లిపోయింది. ఈ విషయంలో బాలీవుడ్ సెలబ్రటిస్ అసూయ పడ్డారు. కనీసం ట్రిపుల్ ఆర్ ఆస్కార్ వచ్చిన కంగ్రాట్స్ చెప్పలేదు. నార్త్ ఆడియెన్స్ మాత్రం సౌత్ సినిమాల వైపే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న సినిమాలన్నీ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌గా రాబోతున్నాయి.
ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ వెయ్యి కోట్లు రాబట్టి.. బాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోసింది. ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు.. పఠాన్ మాత్రమే కాదు, బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు చేయడానికి రెడీ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ.. తెలుగులో కంటే హిందీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల పుష్ప2 గ్లింప్స్ రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ మూవీ పఠాన్ రికార్డులు మాత్రమే కాదు.. బాలీవుడ్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేయడం పక్కా అని.. బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
మరో సినిమా సలార్ కనీవినీ ఎరుగని రికార్డులు క్రియేట్ చేయనుందని అంటున్నారు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్.. మోస్ట్ వైలెంట్ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఈ సినిమా దెబ్బకు బక్సాఫీస్ దగ్గర సునామీ రాబోతోందని అంటున్నారు. ఈ లోపే ఆదిపురుష్ రానుంది. ఈ సినిమా కూడా బాలీవుడ్లో దుమ్ము లేపే ఛాన్స్ ఉంది. మొత్తంగా పుష్ప, సలార్ సినిమాలను చూసి భయపడిపోతున్నాయి బాలీవుడ్ వర్గాలు.