Allu Aravind: ‘గీతా ఆర్ట్స్’ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్!
ఒకప్పుడు ఏమోగానీ.. ప్రస్తుతం అన్నిభాషల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. టాలీవుడ్ టాప్ సంస్థ గీతా ఆర్ట్స్ నుంచి కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉందని.. తాజాగా క్లారీటి ఇచ్చేశాడు అల్లు అరవింద్.
Allu Aravind: ప్రస్తుతం గీతా అర్ట్స్ బ్యానర్లో భారీ చిత్రాలను నిర్మిస్తూ.. అగ్ర స్థానంలో దూసుకుపోతున్నారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆహా వంటి ఓటీటీలో సరికొత్త కంటెంట్‌తో అలరిస్తున్నారు. డబ్బింగ్ సినిమాలతో గట్టిగానే దండుకుంటోంది గీతా ఆర్ట్స్. కాంతార, రీసెంట్గా వచ్చిన మళయాళ బ్లాక్ బస్టర్ 2018 సినిమాలతో గీతా ఆర్ట్స్‌కు భారీ లాభాలు వచ్చాయి. ఇతర నిర్మాతలతో కలిసి హిందీలో జెర్సీ, సెహజాదా వంటి సినిమాలను నిర్మిస్తున్నారు అల్లు అరవింద్. రామాయణం ఆధారంగా ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అలాగే వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీ అవుతున్నారు.
తాజాగా 2018 సక్సెస్‌లో భాగంగా.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌లో రాబోయో అప్ కమింట్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చారు. కార్తికేయ-2తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటితో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి అక్కినేని నాగ చైతన్యతో ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో చందూ మొండేటి డైరెక్షన్లో ఏకంగా 300 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్గా ఏజెంట్ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డి నుంచి మరో ప్రాజెక్ట్.. ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదనుకున్నారు. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు సూరి.
అల్లు అర్జున్‌తో ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. దీంతోపాటు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ బాలయ్యతో ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఫ్యూచర్లో గీతా ఆర్ట్స్ నుంచి భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. చరణ్-బన్నీ కాంబినేషన్లో కూడా ఓ సినిమా ఉంటుందని ఎప్పుడో చెప్పేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో ఓ సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా గీతా ఆర్ట్స్ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయని చెప్పొచ్చు.