TG: హైదరాబాద్లోని రాణిగంజ్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం అయ్యాయి. 65 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులో ఆయన ప్రయాణించారు. ఆయన మాట్లాడుతూ.. ‘2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయి. దీంతో కొత్తగా 373 ప్రాంతాలకు బస్ కనెక్టివిటీ రానుంది’ అని పేర్కొన్నారు.