MNCL: లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహించే స్థానిక ఎన్నికలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఎంపీడీవో సరోజన పరిశీలించారు. బుధవారం ఆమె పట్టణంలోని బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం మండలంలోని 18 గ్రామపంచాయతీలలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.