ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి అభ్యర్థులు గ్రామ సమస్యలను ప్రచార ఆస్త్రాలుగా మార్చుకున్నారు. కోతులు, కుక్కల బెడద, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై తమ శైలిలో హామీలు ఇస్తున్నారు. ఓటర్లు కూడా కోతుల, కుక్కల సమస్యలు పరిష్కరించే అభ్యర్థులనే ఎన్నుకుంటామని కరాకండిగా చెబుతున్నారు.