VSP: నెహ్రూ నగర్ కాలనీలో త్రీ టౌన్ సీఐ పైడయ్య ఆధ్వర్యంలో బుధవారం ఉదయం భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాలు, అనుమతులేని పాన్ షాపులు, గుట్కా విక్రయాలపై తనిఖీ చేశారు. ఆర్సి బుక్కులు లేని, అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంతోష్, సురేష్, పోలీస్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.