గత 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. వీటిలో భారత్-పాక్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్టు-ఇథియోపియా, కొసొవో-సెర్బియా, అర్మేనియా-అజర్బైజాన్ ఉన్నట్లు తెలిపారు. ఇటీవల శాంతి ఒప్పందం కుదిర్చిన కాంబోడియా, థాయ్లాండ్ మళ్లీ యుద్ధానికి దిగాయన్నారు. రేపు ఆ రెండు దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపేస్తానని.. శాంతి నెలకొల్పుతానని పేర్కొన్నారు.