BDK: టేకులపల్లి మండలంలోని బోరింగ్ తండా నుంచి టేకులపల్లి వైపు వస్తున్న బైక్ బుధవారం లారీని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి బొగ్గు తరలిస్తున్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.