TG: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి పదో తరగతి చదువుతున్న ప్రణవ్(15)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.