మీషో షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. NSEలో 46 శాతం ప్రీమియంతో, BSEలో 45.23 శాతం ప్రీమియంతో రూ.161.20 వద్ద లిస్ట్ అయ్యాయి. సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు కలిగిన ఇ-కామర్స్ సంస్థ మీషో రూ.5,421 కోట్ల ఐపీఓ డిసెంబర్ 3 నుంచి 5 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చింది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.105-111గా నిర్ణయించింది.