అన్నమయ్య: రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రైల్వే కోడూరు పట్టణంలో మంగళవారం ఆటో డ్రైవర్లు,యజమానులు ర్యాలీ నిర్వహించారు.KSUF అధ్యక్షుడు బండారు మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసిల్దార్ అమర్నాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు,శంకరయ్య,నరేంద్ర, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.