HYD: అమీర్‌పేటలో మైత్రీవనంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. విద్యార్థులను సిబ్బంది బయటకు పంపుతున్నారు. బ్యాటరీలు పేలి మంటలు వ్యాపించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.