E.G: కిడ్నీ మార్పిడి నిమిత్తం దూబచర్లకు చెందిన ఈడే శ్రీనివాసరావుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.8 లక్షల ఆర్థిక సాయం (ఎల్డీసీ)ను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం పంపిణీ చేశారు. శ్రీనివాసరావుకు కిడ్నీ చికిత్స అత్యవసరం కావడంతో, సీఎంవో కార్యాలయంలో మాట్లాడి ఎల్దసీ మంజూరు చేయించామన్నారు. నల్లజర్ల పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే అందజేశారు.