AP: రేపు కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది. దీంతో కార్పొరేషన్ పరిధిలో ఇవాళ్టి నుంచి 12 వరకు 144 సెక్షన్ అమలు కానుంది. కాగా అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న YCP నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తప్పించడం, అభివృద్ధి పనులకు తీర్మానాలు తప్పనిసరి కావడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అటు ఈ ఎన్నికను నిలిపివేయాలంటూ సురేష్ వేసిన పిటిషన్పై హైకోర్ట్ ఇవాళ తీర్పు ఇవ్వనుంది.