E.G: రాజమండ్రి గృహ ప్రియా సంస్థల అధినేత నాగం గోపాలకృష్ణ(బాబీ) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. రాష్ట్రం లోనే హోమ్ మేడ్ స్వీట్స్‌కు గృహప్రియా పెట్టింది పేరు. గత 30 సం”గా ఆంధ్రా పిండివంటల తయారీలో ఎందరికో మార్గదర్శిగా బాబీ నిలిచారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే బాబీ మరణించడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యకం చేశారు.