NGKL: అచ్చంపేట పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ అధికారులు ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి వీధిని సందర్శించి విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను కూడా తొలగించి విద్యుత్ సరఫరాకు భద్రత కల్పించారు.