ASR: అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ధర, అత్యుత్తమ గుర్తింపు లభించేలా జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కాఫీ రైతులు, వ్యాపారులు, ఎఫ్పీఓలు, ఎన్జీవోలతో సోమవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. జిల్లాలో కాఫీ ట్రేడర్స్ అందరూ కలిసి ట్రేడర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తే, దానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు.