MBNR:బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయ మాజీ ఛైర్మన్, BRS నేత దండు కృష్ణారెడ్డి, జయసుధర్ రెడ్డిలు సోమవారం కాంగ్రెస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని అన్నారు.