NTR: విజయవాడ బెంజ్ సర్కిల్ ఓల్డ్ ఫ్లైఓవర్ ఎండింగ్ వద్ద, మహానాడు నుంచి స్క్రూ బ్రిడ్జ్ వైపు వెళ్లే రోడ్డులో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో టూ వీలర్ పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోయింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.