SDPT: వర్గల్ మండలం నాచారం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లతోల్ల వసంత ఓటర్లకు రూ. 100 స్టాంపు పేపర్‌పై హామీలను రాసి ప్రచారం చేస్తున్నారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ప్రతి వాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పోచమ్మ ఆలయం వద్ద సీసీ రోడ్డు లైటింగ్ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తె, మట్టెలు, నిరుపేదల మృతికి రూ. 5 వేల సహాయం తదితర హామీలను చేర్చారు.