AP: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ‘పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారు. రైతులతో మాట్లాడిన సందర్భంలో మాత్రమే అన్నారు. ఆయన దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదు. తెలంగాణ ప్రజలపై పవన్‌కు నమ్మకం, ప్రేమ ఉంది. ఆయన వ్యాఖ్యలు రాజకీయం చేయాల్సిన అంశం కాదు’ అని పేర్కొన్నారు.