NZB: ఆర్మూర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తమకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు ప్రజలకు సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెత్తను బయట, రోడ్లపై వేయ్యోద్దన్నారు. చెత్తను మున్సిపాలిటీ చెత్త బండికి అప్పగించాలన్నారు. చెత్త బండి రాకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. టౌన్ అభివృద్ధికి పన్నులు చెల్లించి తోడ్పాటు అందించాలన్నారు.
Tags :