NZB: మోస్రా మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల బరిలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 32 ఏళ్ల యువకుడు, 60 ఏళ్ల వృద్ధురాలు సైతం పోటీ చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని యువకుడు రాజకీయ పార్టీలు బలపరిచిన ప్రత్యర్థులకు ప్రచారంలో గట్టి పోటీ ఇస్తున్నారు. బీసీ నినాదంతో ఒకే కాలనీకి చెందిన పక్కపక్క ఇళ్ల వారు తలపడనున్నారు.