నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఆర్అండ్బీ రోడ్లు దుర్భరంగా మారాయి. బారాషహిద్ దర్గా ప్రాంతంలో ఇటీవల వేసిన రోడ్డు దెబ్బతిన్నప్పటికీ, ఆర్అండ్బీ అధికారులు ప్యాచ్ వర్క్ కూడా చేయకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పొట్టే పాలెం రోడ్డు కూడా అధ్వానంగా మారింది. రోడ్ల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.